Today Top Headlines In AP And Telangana:

1. బడ్జెట్ రోజు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర బడ్జెట్ రోజు ఏపీకి మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.30,436.95 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వకు ఆమోదం తెలిపింది. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన బకాయిలు రూ.12,157 కోట్లు మేర ఉన్నాయి. ఇంకా చదవండి.

2. ఏపీలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు

గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం పెంచిన భూముల రిజిస్ట్రేషన్ ను విలువలను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న ధరలను తగ్గించగా.. మరి కొన్నిచోట్ల మాత్రం యథాతథంగా ఉంచారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సగటున రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా 20శాతం పెరిగాయి. నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన ఈ విలువను సవరించారు. ఇంకా చదవండి.

3. తెలంగాణలో షాకింగ్ ఘటన

శవాన్ని రెండు రోజులు ఇంట్లో ఉంచుకోవాలంటేనే చాలా ఆలోచిస్తూ ఉంటారు. అది కూడా అత్యవసర పరిస్థితుల్లోనే అంత్యక్రియలను ఆలస్యంగా చేస్తారు. చనిపోయినప్పటికీ కొందరు తమ పక్కనే ఉన్నట్టు ఫీలయి మరికొందరు భయపడుతూంటారు. కానీ తల్లి చనిపోయిందని తెలిసి కూడా.. ఆ శవాన్ని తమతోనే ఇంట్లోనే ఉంచుకున్నారు ఇద్దరు కూతుళ్లు. అది కూడా 9 రోజులు. వినడానికే భయాన్ని పుట్టించే ఈ ఘటన సికింద్రాబాద్‌ లో జరిగింది. ఈ హృదయ విదారకరమైన ఘటన ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇంకా చదవండి.

4. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.?

తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి రేగింది. కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూప్‌గా ఏర్పడి రహస్య సమావేశం కావడం సంచలనంగా మారుతోంది. అయితే ఆ సమావేశానికి ఎవరు వెళ్లారు. వాళ్లు ఏ ఉద్దేశంతో భేటీ అయ్యారనే విషయాలు కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇదే ఆపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలో టెన్షన్ పెడుతుంది. ఇంకా చదవండి.

5. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

గద్దరన్నపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే  చూస్తూ ఊరుకోబోమని బీజేపీ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తామన్నారు. రవీంద్రభారతిలో గద్దర జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గద్దర్ పద్మ పురస్కారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిందన్నారు. మొత్తం ఐదుగురికి పద్మ పురస్కారాలు ఇవ్వాలని సిఫారసు చేస్తే ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి ఐదుగురికి ఇచ్చారని వారి కంటే తాము సిఫారసు చేసిన వాళ్లు తక్కువగా అని ప్రశ్నించారు. ఇంకా చదవండి.