ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 21,360 మంది నమూనాలను పరీక్షించారు. 117 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 241 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,961 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
భారత్ లో కేసులు
భారత్ లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు మరోసారి పదివేలకు వచ్చాయి. మరోవైపు మరణాల సంఖ్యలో కూడా భారీ తగ్గుదల కనిపించింది. ఇక రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉండటంతో.. క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
కొత్తగా దేశంలో 9,15,198 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 10,229 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందులో ఒక్క కేరళ నుంచే సగానికి పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో నిన్న 5,848 కేసులు.. 46 మరణాలు చోటుచేసుకున్నాయి. కొన్ని రోజులుగా మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండగా.. తాజాగా ఆ సంఖ్య 125కి తగ్గింది. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,63,655కి చేరింది.
నిన్న 11,926 మంది కరోనాను జయించారు. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటి ఆ రేటు 98.26 శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,34,096(0.39 శాతం)కు తగ్గి.. 523 రోజుల కనిష్ఠానికి చేరింది. దేశంలో ఇన్న 30,20,119 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,12,34,30,478కి చేరింది.
Also Read: Delhi Pollution: ఉద్యోగులారా ఇక ల్యాప్ టాప్‌లు తీయండి.. మళ్లీ 'వర్క్ ఫ్రమ్ హోం'!
Also Read: National Employment Policy: వాట్ ఈజ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ.. త్వరలో నిపుణుల కమిటీ
Also Read: Anil Deshmukh Remanded: 'ముందు జైలు కూడు తినండి..' మాజీ హోంమంత్రికి షాకిచ్చిన కోర్టు!
Also Read: Birsa Munda Jayanti: 'స్వతంత్ర భారతావనిలో గిరిజనులకు ఇంత గౌరవం దక్కడం ఇదే తొలిసారి'
Also Read: Gujarat Drugs Seized: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. వీటి విలువ రూ. 600 కోట్ల పైమాటే!