TS SSC Results 2024: తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు ఇవాళ ఏప్రిల్ 30న విడుదలయ్యాయి, రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి.
TS SSC 10th Results 2024: తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు ఇవాళ (ఏప్రిల్ 30న) విడుదలయ్యాయి.
Telangana SSC Results 2024: తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు ఇవాళ (ఏప్రిల్ 30న) విడుదలయ్యాయి. రెగ్యులర్‌తోపాటు ఒకేషనల్ ఫలితాలను కూడా ఒకేసారి విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పరీక్షలకు 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 2676 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారిలో బాలురు 2,57,952 మంది ఉంటే బాలికలు 2,50,433 మంది ఉన్నారు. ఇందులో బాలికలే పైచేయి సాధించారు. 3927 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. నిర్మల్ జల్లా టాప్ ప్లేస్‌లో ఉంది. వికారాబాద్ అత్యల్పస్థానంలో ఉంది.