మీ శరీరంలో ఏ భాగం అనారోగ్యంగా ఉందో మీ మొహం చెప్పేస్తుందండోయ్. మైండ్ జర్నల్ ప్రకారం ముఖంపై మొటిమల స్థానం అంతర్లీన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తుంది. బుగ్గల మీద మొటిమ వస్తే శ్వాస కోస ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ధూమపానం వల్ల కావచ్చు. గడ్డం మీద మొటిమలు వస్తే చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం. హార్మోన్ల సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది. ఒత్తిడి లేదా అధిక కెఫీన్ తీసుకోవడం వల్ల నుదుటి మీద మొటిమలు వస్తాయి. కనుబొమ్మల్లో మొటిమలు వస్తే మాంసం అధికంగా తీసుకుంటున్నారని, కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిక. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ముక్కుపై మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ. నోటి మీద మొటిమలు వస్తే కొవ్వు పదార్థాలు, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. అదీ మరి సంగతి మీ మొటిమలు ఇలా మీ ఆరోగ్యాన్ని చెప్పేస్తాయ్. Images Credit: Pixabay/ Pexels