అసిడిటి చాలా సార్లు హార్ట్ ఎటాక్ మాదిరిగా అనిపిస్తుంది. అసిడిటిలా అనిపించినా హార్ట్ ఎటాక్ కావచ్చు. ఈ తేడాను గుర్తించడం కొంచెం కష్టం. ఈ రెండు సమస్యల మధ్య ఉండే చిన్న తేడాలను గుర్తించే అవగాహన అవసరం. ఎప్పుడైనా అసిడిటి ఛాతిపై భాగంలో మంటగా అనిపిస్తుంది. నోటిలో పుల్లని లేదా చేదు రుచి ఉంటుంది. అసిడిటి వల్ల రిఫ్లక్స్ అవుతుంది. పుల్లని తేన్పులు, కడుపులోని ఆసిడ్ నోట్లోకి రావచ్చు. గుండె పోటు అయితే మాత్రం నొప్పి పైకి పాకుతున్నట్టు ఉంటుంది. ఛాతి నుంచి భుజం, మెడ, దవడం, వీపు వరకు నొప్పి వస్తుంది. హార్ట్ ఎటాక్ లో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. వెంటనే చల్లని చెమట రావడం, మైకం కూడా రావచ్చు. గుండెపోటు అనగానే ఛాతిలో ఎడమవైపు షార్ప్ గా నొప్పి వస్తుందని అనుకుంటారు. కానీ హార్ట్ ఎటాక్ లో చాలా మందికి నొప్పి ఛాతి మధ్యలో వస్తుంది. వర్కవుట్ తర్వాత లేదా ఏదైనా బరువైన పని చేసిన తర్వాత ఛాతిలో అసౌకర్యం హార్ట్ ఎటాక్ కావచ్చు. Representational image:Pexels