సపోటా తింటే బరువు తగ్గడం సులువు సపోటా పండు తింటే ఎంతో ఆరోగ్యం. ఇది తినడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు. దీనిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. సపోటా తినడం వల్ల వెంటనే శరీరానికి శక్తి అందుతుంది. నీరసం, అలసట తగ్గుతుంది. సపోటా తింటే కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకుంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. జలుబు, దగ్గు త్వరగా తగ్గేందుకు సపోటా సహాయపడుతుంది. ఈ పండులో యాంటీ వైరల్, యాంటీ బాక్టిరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి జ్వరం, జలుబు, దగ్గు రాకుండా అడ్డుకుంటాయి. దెబ్బలు తగిలినప్పుడు అధికంగా రక్తస్రావం కాకుండా సపోటాలోని లక్షణాలు అడ్డుకుంటాయి. ఈ పండును తినడం వల్ల ఊబకాయం రాకుండా అడ్డుకుంటుంది. బరువు కూడా తగ్గుతారు.