బీ12 లోపం చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది అనీమియాకు కూడా కారణం అవుతుంది. ఎర్ర రక్తకణాల తయారీకి ఈ విటమిన్ అవసరం. ఇది లోపిస్తే శరీర కణాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. కండరాలు బలహీనపడతాయి. కాలి కండరాలు బలహీన పడడం వల్ల నడక ఇబ్బందిగా ఉంటుంది. వికారంగా ఉంటుంది. బరువు తగ్గుతారు. శక్తిహీనంగా అనిపించడం, సులభంగా అలసిపోతారు . మూడ్ సరిగ్గా లేకపోవడం, త్వరగా విసుగు రావడం, చికాకుగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇవన్నీ కాకుండా చేతులు, కాళ్లలో ఒకరకమైన తిమ్మిరి లాంటి సంకేతాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే బీ12 తగ్గిందని గుర్తించాలి. Representational image:Pexels