వెల్లుల్లి వందల ఏళ్లుగా ఆహారానికి ప్రత్యేకరుచిని ఇచ్చేది మాత్రమే కాదు , ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది.

వెల్లుల్లిలో పోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలతో ఆరోగ్యానికి పవర్ హౌజ్ లాంటిది.

పచ్చి వెల్లుల్లి పరగడుపున తీసుకుంటే దాని ద్వారా అందే ఆరోగ్యం అంతా ఇంతా కాదు.

వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన కలిగిన అలిసిన్ వల్ల తెల్ల రక్తకణాల పనితీరు మెరుగవుతుంది.

పరగడుపునే వెల్లుల్లి తీసుకోవడం వల్ల నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

రక్తపోటు అదుపు చేస్తుంది. కోలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ప్రసరణ వ్యవస్థ అరోగ్యానికి మేలు చేస్తుంది.

జీర్ణరసాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. కడుపులో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది.

వెల్లుల్లి సహజమైన డీటాక్సీఫైయర్. శరీరం నుంచి వ్యర్థాలు బయటకు పంపుతుంది.

వెల్లుల్లి ఇన్సులిన్ సెన్సిటివిటి పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Representational image: Pexels