WHO ఓ సూచన ప్రకారం రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వారంలో కనీసం 5 రోజులు నడవాలి. అరగంట నడక గుండె ఆరోగ్యానికి మంచిదైతే బరువు తగ్గాలంటే మాత్రం కనీసం 45 నిమిషాలు నడవాలి వాకింగ్ కోసం బరువుగా లేని మెత్తని కుషన్ కలిగిన షూస్ ఎంచుకోవాలి. సౌకర్యంగా ఊపిరి తీసుకునేందుకు వీలుగా, కాస్త వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ముందుకు లేదా వెనక్కి వంగి నడవకూడదు. భుజాలు వదులుగా రిలాక్స్ డ్ గా ఉంచుకోవాలి. ఎడమ కాలు కుడి చేయి ముందుకు, ఎడమ చెయ్యి, కుడికాలు ముందుకు కదిలే విధంగా ఒకే వేగంతో నడవాలి. క్రమం తప్పకుండా స్ట్రెచెస్ చేస్తే ఒళ్లు నొప్పులు రావు. వాకింగ్ తర్వాత స్ట్రెచ్చింగ్ చేస్తే మంచిది. వాకింగ్ సమయంలో దాహంగా అనిపిస్తే ఒక గుటక నీళ్లు తాగితే చాలు. బాటిల్ నీళ్లు ఖాళీ చెయ్యకూడదు. Representational image:Pexels