పెరుగు రోజూ కచ్చితంగా తినాల్సిందేనా? కొంతమంది పెరుగు తినరు. కానీ పోషకాహార నిపుణులు మాత్రం రోజు పెరుగు తినాలని చెబుతున్నారు. పెరుగు తినడం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టిరియా ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల పేగు సమస్యలు రాకుండా ఉంటాయి. పెరుగు తినడం వల్ల పొట్ట నొప్పి, విరేచనాలు తరచూ కాకుండా ఆగుతాయి. పెరుగులో మన శరీరానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తాయి. పెరుగు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. దీని వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పెరుగులో ప్రొటీన్ ఉంటుంది. ఇది తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహం ఉన్న వారు కచ్చితంగా రోజూ కప్పు పెరుగును తినాలి. పిల్లలకు కూడా ప్రతి రోజూ పెరుగన్నం తినిపించాలి.