పిల్లలు గంటకంటే ఎక్కువ సేపు ఫోన్ చూస్తే...



ఫోన్లలో బొమ్మలు చూస్తూ ఎక్కువమంది పిల్లలు గంటలు గంటలు అలాగే గడుపుతున్నారు. ముఖ్యంగా రెండేళ్ల నుంచి ఐదేళ్ల పిల్లల విషయంలో ఇలా ఎక్కువ జరుగుతోంది.



పిల్లలు గంటల తరబడి టీవీ చూడడం లేదా ఫోను చూడడం వారి ఆరోగ్యానికి మంచిది కాదు.



చిన్నప్పుడు ఫోన్ అధికంగా చూసే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.



అయిదేళ్లలోపు పిల్లలు రోజులో ఒక గంట కంటే ఎక్కువ సమయం ఫోన్ చూడకూడదని చెబుతోంది.



రెండేళ్ల వయసు దాటిన పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్‌లో అధికంగా పాల్గొనాలి. వారికి కంటి నిండా నిద్ర వచ్చేలా చూడాలి. పోషకాహారాన్ని అందించాలి.



ఫోన్ అలవాటు చేసి ఒక మూలన కూర్చోబెడితే.. వారి మెదడు లో ఎదుగుదల లోపం వచ్చే అవకాశం ఉంటుంది.



వయసు పెరిగాక ఇది మానసిక అభివృద్ధికి ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది.



పిల్లలు రోజులో కనీసం గంట సేపు శారీరక శ్రమ ఉండే ఆటలు ఆడేలా చూడండి. అది వారి ఎదుగుదలకు చాలా అవసరం.