రాత్రిపూట మిగిలిపోయిన కూరలు ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజు వేడి చేసుకుని తినడం ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. అలా చేయడం అసలు మంచిది కాదు. ఏదైనా ఎక్కువ సార్లు వేడి చేస్తే అందులోని పోషకాలు చనిపోతాయి. నూనెని పదే పదే వేడి చేసి వాడటం వల్ల అందులోని ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ ప్రమాదకర స్థాయికి పెరుగుతుంది. స్ప్రింగ్ రోల్స్ మళ్ళీ వేడి చేస్తే అవి వాటి క్రంచినెస్ కోల్పోతాయి. నూనెలో ఎక్కువగా వేయించడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదంగా మారతాయి. రొమ్ము పాలు మైక్రోవేవ్ లో పెట్టి వేడి చేయకూడదు. పోషకాలని కోల్పోతుంది. అవి తాగిస్తే శిశువులకు చాలా ప్రమాదం. చికెన్ వండిన వెంటనే తినాలి. ఇది సాల్మోనెల్లాను అభివృద్ధి చేస్తుంది. దాన్ని నిల్వ చేసి వేడి చేయకూడదు. షెల్ఫిష్ లు చాలా ప్రమాదకరం. వీటిని మళ్ళీ వేడి చేసి తింటే విషంగా మారుతుంది. పుట్టగొడుగులు సరిగా ఉడికించి వండకపోతే కడుపు నొప్పి వస్తుంది. దీన్ని మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు. ఒకసారి ఉడికించిన గుడ్డుని మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు. అది అనారోగ్యానికి దారితీస్తుంది.