పిల్లలకు పాలిస్తే తల్లికెంతో ఆరోగ్యమో

తల్లిగా మారడం వరం. కొంతమంది బిడ్డ పుట్టాక తల్లి పాలు ఇచ్చేందుకు ఇష్టపడరు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం బిడ్డ పుట్టిన రెండేళ్ల వరకు తల్లిపాలు ఇవ్వవచ్చు.

తల్లిపాలు తాగడం వల్ల బిడ్డ ఎన్నో ప్రయోజనాలు పొందుతుంది. అలాగే తల్లికి కూడా ఎంతో ఆరోగ్యం.

బిడ్డకి పాలిచ్చే తల్లులు త్వరగా బరువు తగ్గుతారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి.

బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులకు ప్రసవం అయ్యాక రక్తస్రావం కూడా తక్కువగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది స్త్రీలు ప్రసవానంతరం పోస్టుమార్టం డిప్రెషన్ లోకి వెళ్తారు. బిడ్డకి పాలిచ్చే తల్లులు ఆ డిప్రెషన్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

హైబీపీ, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, రక్తంలో కొవ్వు చేరకపోవడం వంటి సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది.

బిడ్డకు పాలిస్తున్నప్పుడు మళ్లీ పీరియడ్స్ ఆలస్యంగా మొదలవుతాయి. కాబట్టి మీ బేబీ తో ఎక్కువ సమయం సంతోషంగా గడపవచ్చు.