వెనక్కి నడవడం వల్ల ఎన్ని లాభాలో

బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తున్నారా? రోజులో కాసేపు వెనక్కి నడిస్తే బరువు తగ్గడం సులువు అవుతుంది.

ఎక్కువ సేపు అవసరం లేదు, కేవలం పావుగంట నడిచినా చాలు, బోలెడన్ని ప్రయోజనాలు.

ముందుకి నడవడం కన్నా వెనక్కి నడవడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు కరిగిపోతాయి.

వెనక్కి వాకింగ్ చేయడం వల్ల మీలో జాగ్రత్త, అప్రమత్తత పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

కీళ్లు, కండరాలు ముందుకు నడవడానికే అలవాటు పడిఉంటాయి. కానీ వెనక్కి నడవడం వల్ల వాటిలో కాస్త మార్పులు వచ్చి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.

మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

దీర్ఘకాలికంగా నడుము నొప్పితో బాధపడుతున్న వారికి కూడా వెనక్కి నడవడం వల్ల కాస్త మేలు జరుగుతుంది.

వెనక్కి నడవడం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అధికంగా అందుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.