ఇడ్లీ లేదా దోశ పిండి - ఒక కప్పు బెల్లం - ముప్పావు కప్పు ఉప్మా రవ్వ - రెండు స్పూన్లు కొబ్బరి తురుము - అరకప్పు నెయ్యి - రెండు స్పూన్లు యాలకుల పొడి - అర స్పూను వంట సోడా - పావు స్పూను
ఒక గిన్నెలో ఇడ్లీ పిండి లేదా దోశ పిండి వేసి బెల్లం తురుమును వేసి బాగా కలపాలి.
బెల్లం తురుము ఇడ్లీ పిండిలో బాగా కలిసిపోవాలి. బెల్లం బాగా కలవదు అనుకుంటే, బెల్లం, ఇడ్లీ పిండి కలిపి ఓసారి మిక్సీ పట్టొచ్చు.
ఆ తర్వాత ఆ మిశ్రమంలో ఉప్మా రవ్వ, కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.
మీరు ఓవెన్లో కేక్‌ని రెడీ చేయాలి అనుకుంటే కేక్ మౌల్డ్ పై బేకింగ్ పేపర్ వేయాలి.ఆ పేపర్ పై నెయ్యి రాసి కాస్త పిండిని చల్లుకోవాలి.
ఆ మౌల్డ్‌లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేకు మిశ్రమాన్ని వేసి ఓవెన్‌లో పెట్టాలి. నలభై నిమిషాలు ఉంచితే కేకు రెడీ అయిపోతుంది.
కుక్కర్లో వండాలనుకుంటే మెటల్ స్టాండ్ పెట్టి పైన గిన్నెలో కేకు మిశ్రమం వేయాలి. మూత పెట్టి 20 నిమిషాల వరకు చిన్న మంట మీద ఉంచాలి.
ఈ కేక్ తయారీలో వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి పిల్లలకు ప్రతివారం దీన్ని చేసి పెట్టినా ఎలాంటి హాని ఉండదు.