రోజుకు రెండు ఖర్జూరాలు ఎందుకు తినాలంటే...

తీయని ఖర్జూర పండును చూస్తేనే నోరూరిపోతుంది. అయినా చాలా తక్కువ తింటారు ఎంతోమంది.

ఖర్జూరంలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి.

బీటా కెరాటిన్, లూటీన్, జియాగ్జాంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఖర్జూరాలు తినడం వల్ల పెద్దపేగు, ప్రొస్టేట్, రొమ్ము, క్లోమం, ఊపిరితిత్తులు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు.

కంటి ఆరోగ్యానికి ఖర్జూరాలు చాలా అవసరం. రెటినాలోని మాక్యులా ఆరోగ్యాన్ని ఇవి కాపాడతాయి.

అధిక రక్తపోటు ఉన్న వారు వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో పెట్టుకోవాలి.

గుండె, మెదడు వంటి అవయవాలకు ఈ ఎండు పండు ఎంతో మేలు చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి చాలా అవసరం.