ఆహారాలకే అమ్మలాంటివి చిరుధాన్యాలు

బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చిరుధాన్యాలు తినమని చెప్పారు.

జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, అరికెలు, సామలు, ఊదలు... వంటివి చిరుధాన్యాలుగా పిలుస్తారు. వీటిని తినేవారి సంఖ్య తక్కువైపోయింది.

పూర్వం వీటిని మాత్రమే తినేవారు. ఎప్పుడైతే బియ్యం వాడకం పెరిగిందో... అప్పట్నించి చిరుధాన్యాలు తినడం మానేశారు ప్రజలు.

చిరుధాన్యాల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.

వీటిలో ఉండే ఫైబర్‌ ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేస్తాయి. కాబట్టి ఆకలి త్వరగా వేయదు.

విటమిన్ ఎ, విటమిన్ బి, ఫాస్పరస్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, నియాసిన్, కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.

ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ప్రీ డయాబెటిక్ రోగులకు, డయాబెటిస్ బారిన పడిని వారికి ఇవి ఉత్తమ ఆహారం.

నరాల బలహీనత, మలబద్ధకం, క్యాన్సర్, మైగ్రేన్, రక్తహీనత వంటి సమస్యలు ఉన్న వారు చిరు ధాన్యాలతో వండిన ఆహారాన్ని రోజూ తింటే ఇవన్నీ దూరమవుతాయి.