బైపోలార్ డిజార్డర్ లక్షణాలు ఇవే

భయంకరమైన మానసిక వ్యాధుల్లో బై పోలార్ డిజార్డర్ కూడా ఒకటి.

దీనికి కచ్చితంగా వైద్య సహాయం అవసరం. తీవ్రమైన మానసిక కల్లోలంతో ఉన్మాదిగా మారే అవకాశం ఈ వ్యాధితో బాధపడే రోగుల్లో ఉంది.

దీనిలో డిప్రెషన్ వచ్చిపోతూ ఉంటుంది కనిపిస్తాయి. అధికంగా ఖర్చు చేస్తారు. అతిగా మాట్లాడతారు.

శక్తి అమాంతం పెరిగిపోయినట్టు ప్రవర్తిస్తారు. నిద్ర తగ్గిపోతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు సులువుగా మారిపోతుంటారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి.

మద్యపానం చేసే వారిలో, మాదకద్రవ్యాలు వాడే వారిలో, స్ట్రోక్ వంటి పరిస్థితులను నుంచి బయటికి వచ్చిన వారిలో ఇది వస్తుంది.

బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తి లక్షణాల ఆధారంగా మందులను సూచిస్తారు వైద్యులు.

మూడ్ స్టెబిలైజర్లు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, యాంటీ డిప్రెసెంట్లు వంటి మందులు, థెరపీల ద్వారా దీనికి చికిత్స చేస్తారు.