జిమ్ కి వెళ్ళేముందు ఆహారం తీసుకోవాలా వద్దా అనేదాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

కొంతమంది వ్యాయామం ముందు ఆహారం తీసుకోవాలని సూచిస్తుండగా, మరికొందరు జిమ్ కి వెళ్లేటప్పుడు కడుపునిండుగా వెళ్లకూడదని చెప్తారు.

ఏదైనా వ్యాయామం చేయడానికి 30 నిమిషాల ముందు మాత్రమే చిరుతిండి తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

బాదం ఆరోగ్యకరమైనవి కానీ ఇవి జీర్ణం చేసుకోవడం కష్టం. జిమ్ కి వెళ్ళేముందు తింటే కడుపు నొప్పి వస్తుంది.

జిమ్ కి వెళ్ళేముందు కెఫీన్ ఉండే కాఫీ తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది.

అవిసె గింజలు జీర్ణం కావడానికి ఎక్కువ సేపు తీసుకుంటాయి. జిమ్ కి వెళ్ళేముందు వాటిని తీసుకోకపోవడమే బెటర్

వ్యాయామం చేసేముందు స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఇది గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం కలిగిస్తుంది.

నూనెలో బాగా వేయించిన ఆహారం అసలు తీసుకోవద్దు.

వేయించిన ఆహారంలోని అధిక కొవ్వు పదార్థాలు మనల్ని నీరసంగా చేస్తాయి.