కొంతమంది రోటీలు చేశారంటే దవడకి మంచి ఎక్స్సర్ సైజ్ ఇచ్చినట్టే. అలా కాకుండా మెత్తగా రావాలంటే ఈ టిప్స్ పాటించండి. పిండి కలపడం కూడా ఒక కళ. పిండి కలిపడానికి చల్లటి నీళ్ళు అసలు వాడకూడదు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించి పిండి కలిపితే మెత్తగా వస్తాయి. పిండిని హడావుడిగా కలపకూడదు. మెల్లగా ఎక్కువ సమయం తీసుకుంటే అన్ని వైపుల నుంచి పిండి లోపలికి వేసుకుంటూ కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా నూనె వేసి కలుపుకోవడం వల్ల చక్కగా వస్తాయి. ఇది వాటికి మెత్తదనం ఇస్తుంది. పిండి పిసికిన తర్వాత ఒక తడి గుడ్డ కప్పి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేస్తే మెత్తగా వస్తాయి. నానబెట్టిన తర్వాత పిండిని మరొక నిమిషం పాటు మెత్తగా కలపాలి. వాటిని కాల్చే విధానం కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి. పిండి కలిపేటప్పుడు కాస్త పాలు కూడా వేసుకోవచ్చు. అది పిండికి మృదువుగా ఉండేలా చేస్తుంది. రుద్దుకునేటప్పుడు కొద్దిగా పిండి వేసుకుని అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా రుద్దుకుంటే వాటికి మంచి ఆకృతి కూడా వస్తుంది. ఈ టిప్స్ పాటించి రోటీలు చేశారంటే కొన్ని గంటల తర్వాత వాటిని వేడి చేసుకుని తిన్నా కూడా మెత్తగానే ఉంటాయి. Image Credit: Pexels