డయాబెటిస్‌తో నరాలు దెబ్బతినే ప్రమాదం

డయాబెటిక్ రోగులు నిత్యం జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో ఏమాత్రం తేడా వచ్చిన వెంటనే దాని ఫలితం కనిపిస్తుంది.

రక్తంలో చక్కెర అధికమైతే సంభవించే కలిగే నరాల సమస్య ‘డయాబెటిక్ న్యూరోపతి’.

రక్తంలో చక్కెర పెరగడం వల్ల రక్తనాళాల గోడలు బలహీనపడతాయి. నాడులకు ఆక్సిజన్, పోషకాలు అందే సామర్థ్యం తగ్గిపోతుంది.

డయాబెటిక్ న్యూరోపతి వచ్చిన వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.

శరీరం జలదరింపుగా అనిపించడం, తిమ్మిర్లు అధికంగా రావడం, శరీరంలో కారణం లేకుండా మంట, నొప్పి వంటివి వస్తాయి.

ఈ పరిస్థితి వల్ల నరాలకు నష్టం వాటిల్లుతుంది. వెంటనే చికిత్స తీసుకోకపోతే పరిస్థితి తీవ్రమవుతుంది.

డయాబెటిక్ న్యూరోపతి వచ్చినట్టు అనుమానం వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఆలస్యం చేయకూడదు.