మెనోపాజ్ ముందస్తుగా వస్తే ముప్పే

మహిళల్లో మెనోపాజ్ ముందస్తుగా వస్తే, వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతోందనిచెబుతోంది ఒక అధ్యయనం.

సాధారణంగా మహిళల్లో మెనోపాజ్ 45 ఏళ్లు దాటాక వస్తుంది. అలా వస్తే సరైన సమయానికి వచ్చినట్టే లెక్క.

కొందరికి 45 ఏళ్లు రాకముందే నెలసరి నిలిచిపోతుంది. దీన్ని ‘ఎర్లీ మెనోపాజ్’ అంటారు.

మరికొందరిలో 40 ఏళ్లు రాకముందే నెలసరి నిలిచిపోతుంది. దీన్ని ‘ప్రీ మెచ్యూర్ మెనోపాజ్’ అంటారు.

ఇలాంటి వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్టు కొరియా పరిశోధన కర్తలు చేసిన అధ్యయనంలో తేలింది.

గుండె వైఫల్యం చెందడం, గుండె కొట్టుకొనే వేగం మారిపోవడం వంటివి ఎక్కువగా వీరిలో కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

మెనోపాజ్ ముందస్తుగా రాకుండా, సరైన సమయానికి రావాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.

ధూమపానం, ఆల్కహాల్ తాగడం వంటివి మానేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొవ్వు, తీపి పదార్థాలు తగ్గించాలి.