నిద్రపోవడానికి ముందు పండ్లు తినొచ్చా? పండ్లు ఆరోగ్యానికి మంచివే. వీటిలో బోలెడన్ని విటమిన్లు, ఫైబర్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. పండ్లు బ్లడ్ ప్రెజర్ నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. మరి ఇంత మేలు చేసే పండ్లను రాత్రి నిద్రపోవడానికి ముందు తినోచ్చా? బెస్ట్ టైమ్ ఏమిటీ? పండ్లను నిద్రలేచిన తర్వాత ఉదయం వేళలో తినడమే ఉత్తమం. దానివల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. ఉదయం వేళ పండ్లను తిన్నట్లయితే అందులోని పోషకాలు సక్రమంగా శరీరానికి అందుతాయి. అలాగే భోజనానికి కొన్ని గంటల ముందు పండ్లను తినడం కూడా మంచిదే. అయితే, నిద్రపోవడానికి ముందు మాత్రం పండ్లను అస్సలు తినొద్దు. నిద్రకు ముందు పండ్లు తింటే బ్లడ్ షుగర్ స్థాయిలు పెరుగుతాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అలాగే, భోజనంతోపాటు కూడా పండ్లు తినడం కూడా మంచిది కాదు. జీర్ణ సమస్యలు వస్తాయి. Images Credit: Pexels, Pixabay and Unsplash