ఇప్పుడు సమంత పాటిస్తున్న డైట్ ఇదే మయోసైటిస్ బారిన పడిన సమంత ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే, కఠినమైన ఆహార నియమాలను పాటిస్తోంది. ఈ వ్యాధిని తట్టుకునేందుకు తాను ఆటోఇమ్యూన్ డైట్ పాటిస్తున్నట్టు తన ఇన్ స్టా ఖాతాలో తెలిపింది. ఆటోఇమ్యూన్ వ్యాధులకు గురైన వారు కచ్చితంగా పాటించాల్సిన డైట్ ఇది. దీనివల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్, నొప్పి, నీరసం, అలసట రావు. ఈ డైట్లో భాగంగా గుడ్లు, పాల ఉత్పత్తులు, కాఫీ, చక్కెర, పప్పులు వంటివి 3 నెలల పాటూ పూర్తిగా మానేయాలి. ఆ వ్యాధి లక్షణాలు తగ్గి, ఆరోగ్యం మెరుగుపడ్డాక స్వల్ప మోతాదుల్లో వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ డైట్లో కచ్చితంగా తినాల్సిన పదార్థాలు కూడా ఉన్నాయి. తాజా పండ్లు, కాయగూరలు, పులిసిన ఆహార పదార్థాలు, ప్రాసెస్ చేయని మాంసం, అవకాడో, ఆలివ్, కొబ్బరి నూనెలు తినవచ్చు. గ్రీన్ టీ, బ్లాక్ టీ, మటన్ పాయ వంటివి కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఇవన్నీ కూడా జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తాయి.