రోజుకో స్పూను తేనెతో ఆరోగ్యం తీయని తేనె అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ తేనె మంచిఫలితాలుఇవ్వాలంటే పరగడుపున తాగాలి. ఉదయం లేచిన వెంటనే ఒక స్పూను తేనె తింటే ఎన్ని లాభాలో తెలుసుకోండి. రోగనిరోధక శక్తి పెంచడంలో తేనె ముందుంటుంది. దీనిలో హానికారక బ్యాక్టిరియాను శరీరంలో అడ్డుకునే లక్షణాలు ఉంటాయి. తేనెలో ఐరన్, కాల్షియం, సల్ఫర్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో స్పూను తినమని చెబుతారు వైద్యులు. రోజూ ఉదయం పరగడుపున ఖాళీ పొట్టతో గోరువెచ్చటి నీళ్లలో కలుపుకుని తాగితే ఎంతో మంచిది. పిల్లలకు తినిపిస్తే వారి రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.