చలిలో ఎముకలు బాగా పనిచేయడానికి వాటిని కదిలిస్తూ ఉండాలి. రోజూ వ్యాయామాలు చేయాలి. శరీరాన్ని చురుగ్గా ఉంచాలి వాకింగ్, థ్రెడ్ మిల్ పై నడవడం, యోగా వంటివి చేయాలి. శరీరంలో అవయవాలు పని చేయటానికి నీళ్ళు చాలా ముఖ్యం. అందుకే చలికాలంలో నీళ్లు బాగా తాగాలి. బోన్ సూప్, వెజిటేబుల్ సూప్స్, పానీయాలు తాగడం కూడా మంచిదే. ఎముకలు, కీళ్ళ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు విటమిన్ -D సూర్యరశ్మి నుంచి వస్తుంది. అలా అని గంటల కొద్ది సూర్యరశ్మిలో ఉండటం హానికరం. రోజు 10-20 మాత్రమే ఉండాలి. చలికాలంలో వెచ్చగా ఉండటానికి ప్రయత్నిచండి. అంటే ఉన్ని దుస్తులతో శరీరాన్ని కప్పి ఉంచాలి. ఎందుకంటే చలికాలంలో శరీరాన్ని తగిన ఊష్నోగ్రతలో ఉంచడం ముఖ్యం. చలికాలంలో అనారోగ్యం, నొప్పుల బారిన పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ చక్కర, కొవ్వు ఉన్నవి కాకుండా పండ్లు, కూరగాయలు, చిరుదాన్యాలు, ఆకుకూరలు తినాలి. అనారోగ్యపు అలవాట్ల వల్ల బరువు పెరిగి.. అది మోకాళ్ళు, కీళ్ళ పై ప్రభావం చూపుతుంది. అందుకే మనం తినే ఆహారంలో క్యాలరీల మొత్తాన్ని సరైన మోతాదులో ఉండేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు. Images Credit: Pexel