మనం రోజూ తీసుకునే కొన్ని ఆహారాలు అలర్జీ కలిగిస్తాయి. అందుకే ఫుడ్ ఎలర్జీ ఉన్న వాటిని దూరం పెట్టడమే మంచిది. అత్యంత సాధారణ అలర్జీలలో పాలు ఒకటి. ఇవి కడుపునొప్పి, ఉబ్బరంకి దారితీస్తుంది. వెల్లుల్లి అంటే అలర్జీ ఉన్న వాళ్ళకి శ్వాసలో గురక, నోటి చుట్టూ వాపు వస్తుంది. రొయ్యలు తింటే కొంతమందికి ఊపిరి ఆడదు. దద్దుర్లు, తుమ్ములు వస్తాయి. చాలా మందికి గుడ్డు అలర్జీ ఉంటుంది. ఇది తింటే తిమ్మిరి, వాంతులు అవుతాయి. వేరుశెనగ వల్ల తీవ్రమైన అలర్జీ ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దద్దుర్లు వస్తాయి. నువ్వులు తింటే కొంతమందికి తేలికపాటి దద్దుర్లు, తిమ్మిర్లు వస్తాయి. ఎన్నో పోషకాలు అందించే అరటి వల్ల కూడా అలర్జీ వస్తుంది. ఇది తింటే కొంతమందికి నోటిలో దురద కలిగిస్తుంది. ఘాటైన ఉల్లిపాయ వల్ల కూడా అలర్జీ వస్తుంది. కానీ ఇది చాలా అరుదు కేసుల్లోనే జరుగుతుంది. ఆవకాడో తింటే కొందరికి తుమ్ములు, కడుపులో అసౌకర్యం, పెదవులు వాపు ఉంటుంది.