జ్యూస్‌లు తాగితే బరువు పెరుగుతారనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ జ్యూస్‌లు తాగారంటే మాత్రం బరువు తగ్గుతారు. ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ లో రోగనిరోధక శక్తి పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ విటమిన్ ఏ, సి, కె, ఫైబర్, పొటాషియం, ఫోలేట్ తో పాటు అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గించడమే కాదు కంటి చూపును మెరుగుపరుస్తుంది. సొరకాయ జ్యూస్ హృద్రోగులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకుంటే కడుపులో తేలికగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన పుచ్చకాయ జ్యూస్ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఎంతో రుచి కలిగిన క్రాన్బెర్రీ పండ్లతో చేసే ఈ జ్యూస్ లో ప్రోయాంతో సైనిడిన్స్ నిండి ఉన్నాయి. క్రాన్బెరీ జ్యూస్ పిరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.