మటన్ రోస్ట్ సింపుల్ రెసిపీ


మటన్ - అరకిలో
ఉల్లిపాయ - ఒకటి
టమోటో - ఒకటి
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి - ఐదు రెబ్బలు
మిరియాల పొడి -అరటీ స్పూన్



కారం -అర టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - అర టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
కరివేపాకులు - రెండు రెమ్మలు
నూనె - సరిపడా


కుక్కర్లో మటన్, పసుపు, మిరియాల పొడి, ఒక గ్లాసు నీళ్లు పోసి ఉడకబెట్టాలి.

స్టవ్ పై కళాయిలో నూనె వేసి, వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.

అవి వేగాక ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, కరివేపాకులు వేసి వేయించాలి.

అవి వేగాక టమోటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. చిక్కగా ఇగురులా అయ్యేవరకు ఉడకనివ్వాలి.

తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్‌ను వేసి కలపాలి.

మూత పెట్టి చిన్న మంటపై 20 నిమిషాల పాటు వేయించాలి. అంతే మటన్ రోస్ట్ రెడీ.