రొయ్యలు తినడం మానేస్తే మీకే నష్టం రొయ్యల ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం టాప్ టెన్ దేశాల్లో ఒకటి. కానీ అధికంగా తినే దేశాల్లో చూసుకుంటే మన దేశం ఎక్కడో అడుగుస్థానంలో ఉంది. ఇతర మాంసాహారాలతో పోలిస్తే అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్ రొయ్యల్లో ఉంటాయి. మనిషికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు వీటిలో ఉంటాయి. రొయ్యలు తినడం వల్ల శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయని who చెప్పింది. రొయ్యల్లో పిండి పదార్థాలు, కొవ్వులు ఉన్నప్పటికీ వాటి ద్వారా వచ్చే కేలరీలు చాలా తక్కువ. కాబట్టి వీటిని తిన్నా కూడా బరువు పెరగరు. టైప్ 2 మధుమేహంతో పాటు రక్తపోటును కూడా రాకుండా అడ్డుకుంటాయి రొయ్యలు. గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది కాబట్టి రొయ్యలు తినడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. థైరాయిడ్ బారిన మహిళలు అధికంగా పడతారు.రొయ్యల్లోని పోషకాలు థైరాయిడ్ గ్రంధుల పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి చర్మానికి, జుట్టుకు, గోళ్ళకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తాయి.