క్యారెట్ హల్వా తింటే ఎంతో ఆరోగ్యం స్వీట్లు అధికంగా తింటే అనారోగ్యాలే. కానీ క్యారెట్‌తో చేసిన హల్వా తింటే మాత్రం ఎంతో ఆరోగ్యం. క్యారెట్ హల్వాను పంచదారతో కాకుండా బెల్లంతో తయారుచేసి తింటే మంచిది. దీనిలో పాలు కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఎముకల ఆరోగ్యం బావుంటుంది. ఇందులో వాడే బెల్లం వల్ల ఇనుము పుష్కలంగా లభిస్తుంది. క్యారెట్ హల్వాలో నెయ్యి వాడతారు. ఇది చర్మానికి మేలు చేస్తుంది. ఈ హల్వాలో విటమిన్లు ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యారెట్లో బీటాకెరాటిన్ అధికంగా ఉంటుంది. అలాగే ఫైబర్ నిండుగా ఉంటుంది. బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా తినడం వల్ల చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది.