ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆల్కహాల్ ఒక్క స్పూను తాగినా అది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని, సురక్షితం కాదని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆల్కహాల్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఐరోపాలో ప్రస్తుతం 200 మిలియన్ల మంది ఆల్కహాల్ కారణంగానే క్యాన్సర్ వచ్చే ప్రమాదంలో ఉన్నారని అని నివేదికలో తెలిపింది. ఆల్కహాల్ కనీసం ఏడు రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది. శరీరంలో చేరిన ఆల్కహాల్ క్యాన్సర్ వ్యాధికి ట్రిగ్గర్ గా పనిచేస్తుందని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే మద్యం తాగిన వెంటనే రక్తంలో కలుస్తుంది. ప్రతి అవయవాన్ని త్వరగా చేరుతుంది. మద్యం తాగడం వల్ల రక్తంలో నీరు శాతం తగ్గిపోతుంది. వెంటనే తలనొప్పి వస్తుంది. చివరకు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.