పొట్ట చుట్టూ చెరిపోయిన కొవ్వు వల్ల మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో పోరాటం చేయాల్సి వస్తుంది.

కొవ్వు పేరుకుపోవడానికి కారణం తీసుకునే ఆహారం, సరిగా వ్యాయామం చేయకపోవడం.

ప్రతిరోజూ క్రమం తప్పకుండా వీటిని పాటిస్తే బొడ్డు చుట్టూ పేరుకుపోయే కొవ్వుని ఇట్టే కరిగించేసుకోవచ్చు.

రోజు ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. ఇది జీవక్రియని పెంచుతుంది. కొవ్వుని కరిగించేస్తుంది.

కొవ్వుని కరిగించుకునే సులభమైన మార్గం ఇది. క్రమం తప్పకుండా 12 సూర్యనమస్కారాలు, కపాల్ భతి ప్రాణాయామం చేయాలి.

మెంతి గింజలు రాత్రంతా నానబెట్టి పొద్దున్నే తిన్నా కొవ్వుని కరిగించేస్తుంది. మెంతుల పొడి నీళ్ళు తాగినా సరిపోతుంది.

అల్లం పొడి గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. జీవక్రియను పెంచుతుంది. కొవ్వుని కరిగించేందుకు సహాయపడుతుంది.

30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయాలి. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకునే ప్రభావవంతమైన మార్గం ఇది.

త్రిఫల చూర్ణం తీసుకున్నా కూడా కొవ్వు కరిగించుకోవచ్చు. శరీరంలోని విష వ్యర్థాలని బయటకి పంపించడంలో సహాయపడుతుంది.