రాత్రి పూట నిద్రపోయే ముందు పాలు తాగడం మంచిది కాదా? అంటే కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పాలలోని లాక్టోజ్, గ్లూకోజ్, గేలాక్టోస్ తో కలిసి సులభంగా గ్రహించబడుతుంది. ఈ లాక్టేజ్ ఎంజైన ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

5 సంవత్సరాల కంటే వయస్సు ఎక్కువ ఉన్న వారి శరీరంలో లాక్టేజ్ ఉత్పత్తి తగ్గుతూనే ఉంటుంది.

30 సంవత్సరాల వయస్సులో లాక్టేజ్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. దాని వల్ల పాలు నేరుగా పెద్ద పేగులకి చేరి అజీర్తికి కారణం అవుతాయి.

జీర్ణక్రియలో సమస్యలు ఉన్న వాళ్ళు అసలు పాలు తాగకూడదు. అయితే రాత్రి భోజనం తర్వాత పాలు తీసుకోవచ్చు.

ఒక వేళ పాలు తాగాలని అనుకుంటే నిద్రపోవడానికి 2 లేదా 3 గంటల ముందు తాగాలి. నిద్ర పోయే ముందు తాగడకూడదు.

రాత్రిపూట పాలు తాగడం వల్ల ప్రోటీన్, పాల కొవ్వులు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

కానీ పాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. ఎముకలు ధృడంగా మారేందుకు సహకరిస్తాయి.

విటమిన్ ఏ, బి 12, పొటాషియం, మెగ్నీషియం,జింక్, అయోడిన్ వంటివి పాల వల్ల లభిస్తాయి. రోజూ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రాత్రి వేళ కంటే పగటి వేళ పాలు తాగడం మంచిది. పాలల్లోని కాల్షియం, సోడియం, శరీరంలోని విష వ్యర్థాలని బయటకి పంపిస్తాయి.