ఎత్తు ఎక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం? క్యాన్సర్ అనేది శరీరంలో వివిధ భాగాలకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం ఎత్తు కూడా ఆ వ్యక్తి క్యాన్సర్‌కు గురవుతాడో లేదో నిర్ధారిస్తుందని తేలింది. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ ప్రకారం మనిషి ఎత్తు ఎక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ. మనిషి ఎత్తు ఎంత ఎక్కువగా ఉంటే, అంత అధికంగా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అండాశయాల క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్, రొమ్ము, కిడ్నీ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని బయటపడింది. అయితే పొడవుగా ఉండడం ఒక శాపం అని చెప్పడం లేదు. మధుమేహం, బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వంటి రోగాలు వచ్చే అవకాశం పొడవుగా ఉండే వారిలో తక్కువగా ఉంటాయి.