తరచూ జుట్టు కడుక్కోవడం వల్ల జుట్టు రాలడం, చిట్లిపోవడం జరుగుతుంది. అందుకు కారణం తలస్నానం చేసేటప్పుడు చేసే కొన్ని తప్పులు.

పొడి జుట్టుమీద షాంపూ అప్లై చేయడం కరెక్ట్ కాదు.పొడి జుట్టు మీద షాంపూ పెట్టడం వల్ల తలపై మురికి ఎక్కువగా పేరుకుపోతుంది.

అందుకే తలస్నానం చేసేటప్పుడు జుట్టుని 1-2 నిమిషాల పాటు నీటితో నానబెట్టాలి.

ఎక్కువ షాంపూ, కండిషనర్ వద్దు. అధిక షాంపు జుట్టు సహజ తేమని దెబ్బతీస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని ఎక్కువ చేస్తుంది.

కండిషనర్ ఎక్కువగా పెట్టడం వల్ల జుట్టు జిడ్డుగా తయారవుతుంది.

చిక్కు జుట్టు మీద షాంపూ పెట్టకూడదు. తలస్నానం చేసే ముందు జుట్టు చిక్కు తీసుకోవడం తప్పనిసరి.

ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు ఉండదు. ఇది జుట్టు సహజ నూనెని తొలగిస్తుంది.

జుట్టు సహజమైన మెరుపుని కాపాడుకోవాలంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లు తేలికపాటి షాంపూని ఉపయోగించి తలస్నానం చేయాలి.

స్కాల్ఫ్ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకురాకుండా సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. షాంపూని చేసేటప్పుడు తలపై తేలికగా మసాజ్ చేసుకోవాలి.

మితిమీరిన వేడి నీటితో జుట్టు శుభ్రం చేసుకోవడం అసలు మంచిది కాదు. ఇది జుట్టు చిట్లడం, రాలడానికి దారితీస్తుంది.

జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఎప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.