అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం తినాలి. ఇవి ఆకలి కలిగించే హార్మోన్ గ్రెలిన్ స్థాయిలని తగ్గిస్తుంది.

నిద్రలేవగానే గ్లాసు నీటితో రోజుని ప్రారంభించండి. శక్తిని ఇస్తుంది. రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.

ప్రతిరోజు బరువు చెక్ చేసుకుంటే మంచిది. ఇది బరువు రోజు ఎంత తగ్గుతున్నారు లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నారో తెలుపుతుంది.

మనసు ప్రశాంతంగా రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు మెడిటేషన్ ముఖ్యం. ఆలోచనలు, కోరికల మీద నియంత్రణ ఉంటుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

వేపుళ్ళు తగ్గించి ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇంట్లోని భోజనం చేయడం అన్నింటికంటే ముఖ్యం.

కంటి నిండా నిద్రపోవాలి. నిద్రలేమి ఆకలిని పెంచుతుంది.

ఎలాంటి ఆహారం తినాలి, ఎన్ని కేలరీలు తీసుకోవాలి అనే దాని గురించి ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

సమతుల్య ఆహారం తీసుకుంటూనే బరువు తగ్గించుకోవచ్చు.
Image Credit: Pexels