ఈ జ్యూస్‌తో చర్మం మెరవడం ఖాయం అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అలాంటి అందమైన చర్మాన్ని ఇచ్చేది ఈ జ్యూస్. ఒత్తిడి, కాలుష్యం కారణంగా చర్మం మెరుపును కోల్పోతుంది. అనేక చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే రోజుకి ఒక గ్లాసు ఈ జ్యూస్ తాగితే చాలు. ఆ జ్యూస్ ఏంటో తెలుసా? క్యారెట్, యాపిల్, ఆరెంజ్ కలిపి చేసిన జ్యూస్. దీని తాగడం వల్ల కేవలం రెండు వారాల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండటమే కాదు, ఉదయం నుంచి రాత్రి వరకు చురుగ్గా ఉంటారు. క్యారెట్లు, యాపిల్, ఆరెంజ్ సమపాళ్లలో తీసుకుని జ్యూస్ చేసుకోవాలి. కావాలంటే చిన్న ముక్క అల్లం తరుగు కూడా వేస్తే మంచిది. ఆపిల్, నారింజలో ఉండే విటమిన్ సి శరీరానికి అందుతుంది. ఎముకలు, దంతాలు కూడా దృఢంగా అవుతాయి. ఈ జ్యూసులో పాలిఫెనాల్స్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి అల్జీమర్స్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. చాలామందిని కిడ్నీ వ్యాధులు కూడా ఇబ్బంది పెడతాయి. అలాంటివారు ఈ జ్యూస్ తాగడం వల్ల ఫలితం ఉంటుంది.