టేస్టీ పచ్చిబఠానీ - చీజ్ కట్‌లెట్ రెసిపీ

పచ్చి బఠానీలు - ఒక కప్పు
బంగాళాదుంప - ఒకటి
పచ్చిమిర్చి - 2
చీజ్ క్యూబ్స్ - 100 గ్రాములు
ఉప్పు - తగినంత

వెల్లుల్లి - 5 రెబ్బలు
బ్రెడ్ పొడి - 4 స్పూన్లు
ఆలివ్ నూనె - 2 స్పూన్లు
జీలకర్ర పొడి - పావు స్పూను
మ్యాంగో పొడి - అర స్పూను
యాలకుల పొడి - పావు స్పూను

ఒక కళాయిలో నూనె వేసి, వెల్లుల్లి రెబ్బలు,పచ్చిమిర్చి, బఠానీలు వేసి వేయించాలి. అందులో ఉప్పు, యాలకుల పొడి కలపాలి.

ఈ మిశ్రమాన్ని మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఆ బఠానీల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఆ మిశ్రమంలో ఉడికించిన బంగాళాదుంపలు చేత్తో మెదిపి బాగా కలపాలి. జీలకర్ర పొడి, బ్రెడ్ పొడి కూడా వేసి కలపాలి.

ఆ మిశ్రమం నుంచి ఒక చిన్న ముద్ద తీసి మధ్యలో చీజ్ ముక్క పెట్టి చేత్తో కట్‌లెట్‌లా ఒత్తుకోవాలి.

నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి వీటిని వేయించాలి. రెండువైపులా బ్రౌన్ రంగులోకి మారే వరకు ఫ్రై చేయాలి.