స్పైసీ ఫుడ్ తింటే జలుబు తగ్గుతుందా? డాక్టర్లు ఏమన్నారంటే.. స్పైసీ ఫుడ్ తింటే జలుబు తగ్గుతుందని అంటారు. మరి ఇందులో నిజమెంతా? శతాబ్దాలుగా ‘క్యాప్సైసిస్’ అనే కారాన్ని గాయలు మాన్పేందుకు, అనస్థీషియాగా కూడా వాడుతున్నారు. అయితే, జలుబుగా ఉన్నవారు కాస్త స్పైసీ ఫుడ్ తీసుకుంటే నయమవుతుందనేది మాత్రం అపోహే. ఎందుకంటే, ‘క్యాప్సైసిస్’ వైరస్‌లతో పోరాడలేదు. కానీ, కొన్ని జలుబు లక్షణాలను మాత్రం తగ్గిస్తుంది. స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ముక్కు కారుతుంది. దీన్ని గస్టేటరీ రినిటిస్ అని పిలుస్తారు. స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు చెమట పట్టడానికి అదే కారణం. మెదడకు అందే సంకేతాల వల్లే ఇలా జరుగుతుంది. అయితే, ఆ స్పైసీ ఫుడ్‌లు జలుబుపై ఎలాంటి ప్రభావం చూపలేవు. పైగా సమస్యలను పెద్దవి చేయొచ్చు. జలుబు ఉన్నప్పుడు స్పైసీ ఫుడ్‌కు బదులు విక్స్ వంటివి ఉపయోగించడమే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. Images Credit: Pixabay, Pexels and Unsplash