గ్రీన్ టీతో ఆ సప్లిమెంట్లు వేసుకోకూడదు

ఆహారం ద్వారా పోషకాలు లభించాలి. కానీ కొంతమంది పోషకాల కోసం సప్లిమెంట్ల మీద ఆధారపడుతుంటారు.

ఐరన్ సప్లిమెంట్లను వాడేవారు గ్రీన్ టీ ని పక్కన పెట్టాలి. గ్రీన్ టీ గుణాలు శరీరం ఐరన్ శోషించుకోకుండా చేస్తుంది.

ఇనుము తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఐరన్ సప్లిమెంట్లు వాడేవాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండటమే బెటర్.

మెగ్నీషియ, కాల్షియం... ఈ రెండు సప్లిమెంట్లు కూడా కలిపి వేసుకోకూడదు.

మెగ్నీషియం, క్యాల్షియాన్ని శరీరం శోషించుకోవడంలో అడ్డుపడుతుంది.దీనివల్ల కాల్షియం లోపం అధికమైపోతుంది.

విటమిన్ సి, కాపర్ సప్లిమెంట్లు కలిపి వేసుకోకూడదు. విటమిన్ సి, కాపర్ ను శరీరం గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

దీనివల్ల కాపర్ లోపం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

విటమిన్ డి, ఇ, కె సప్లిమెంట్లు కూడా కలిపి తీసుకోకూడదు. ఈ మూడు సప్లిమెంట్లను రెండు గంటల గ్యాప్ లో వేసుకోవడం మంచిది.