ఎర్రకందిపప్పుతో పనీర్ ఇలా చేయండి పాలతోనే కాదు, మసూర్ దాల్‌తో కూడా పనీర్ తయారుచేయవచ్చు. గోరువెచ్చని నీటిలో ఈ పప్పును వేసి 20 నిమిషాలు నానబెట్టాలి.20 నిమిషాల తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేయాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఒకటిన్నర కప్పు నీటిని వేయాలి. నీరు కొంచెం వేడెక్కాక మిక్సీలో రుబ్బుకున్న పిండిని కూడా వేయాలి. గరిటతో నిత్యం కలుపుతూనే ఉండాలి. అలా ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించాలి. ఉండలు కట్టకుండా, గడ్డలు కట్టకుండా మిశ్రమం చిక్కగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. చిన్న మంట మీద ఉడికిస్తే, మాడిపోకుండా ఈ మిశ్రమం చిక్కగా అవుతుంది. తరువాత స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు చతురస్రాకారంలో ఉన్న ఒక గాజు కంటైనర్ను తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. పైన చిన్న క్లాత్ తో కప్పి మూత పెట్టేయాలి. ఆరుగంటల పాటు అలా వదిలివేస్తే, గట్టిపడి పనీర్ తయారవుతుంది. ముక్కలుగా కట్ చేసుకుని కూరలా వండుకోవచ్చు.