చలికాలంలో వాతావరణం వల్ల స్కాల్ఫ్, జుట్టు పొడిబారిపోతుంది. అందుకే క్రమం తప్పకుండా నూనె రాయడం వల్ల పోషణ లభిస్తుంది.

రెగ్యులర్ గా నూనె రాయడం వల్ల జుట్టు చిట్లిపోకుండా చేస్తుంది. ఈ శీతాకాలంలో మీకు సహాయపడే కొన్ని మంచి ఆయిల్స్ ఇవి.

కొబ్బరినూనె జుట్టు లోపలి నుంచి పోషణ అందిస్తుంది. తల దురదను నివారిస్తుంది. జుట్టు చిట్లకుండా కాపాడుతుంది.

బాదం నూనె

బాదం నూనెలో విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

ఆలివ్ ఆయిల్ స్ప్లిట్స్ నివారించడంలో సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్ లో దాల్చిన చెక్క పొడి కలుపుకుని తలకు రాసుకుంటే ఒత్తుగా జుట్టు పెరుగుతుంది. జుట్టుకి పోషణ అందిస్తుంది.

బృంగరాజ్ నూనె జుట్టుకి చాలా మేలు చేస్తుంది. జుట్టు విరిగిపోకుండా నిరోధిస్తుంది.

ఎన్నో ఔషధ గుణాలు కలిగిన బృంగరాజ్ నూనె జుట్టుకి పోషణ అందించి పెరిగేలా చేస్తుంది.
Image Credit: Pexels