టీ తాగేటప్పుడు పక్కన బిస్కెట్స్ పెట్టుకుని వాటిని నంచుకుంటూ తినడం చాలా మంది చేస్తారు.

కానీ టీతో కలిపి ఈ పదార్థాలు తీసుకుంటే అది చాలా ప్రమాదం. కడుపు సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది.

మిల్క్ టీ తో కలిపి నిమ్మకాయ తీసుకోవడం అసలు మంచిది కాదు.

లెమన్ టీ ఉదయాన్నే తీసుకోకూడదు. ఎసిడిటీ సమస్య ఉంటే పూర్తిగా నివారించడం ఉత్తమం.

ఆకు కూరలు, ధాన్యాలు, కాయధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలతో కలిపి టీ తాగకూడదు.

టీలో టానిన్లు, ఆక్సలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాల నుండి ఐరన్ ను శరీరం శోషించబడకుండా నిరోధిస్తుంది.

ఐస్ క్రీం వంటి చల్లని ఆహారాలు టీతో కలిపి తినకూడదు. జీర్ణక్రియని ప్రభావితం చేస్తుంది.

శనగపిండితో చేసిన క్రిస్పీ ఆహారాలు టీతో తీసుకుంటే రక్తంలో పోషకాలు శోషించకుండా అడ్డుకుంటుంది. కడుపునొప్పి వస్తుంది.

పసుపును టీతో కలపడం వల్ల తీవ్రమైన అజీర్ణం, గుండెల్లో మంట ఇబ్బంది పెడుతుంది.

వేయించిన వేరుశెనగలు, మసాలా కాజు లేదా ఉప్పు పిస్తా వంటి వాటిని టీతో కలిపి తీసుకోకూడదు.

నట్స్ లో ఐరన్ ఉంటుంది. పాలు, టీతో అది కలిపితే సమస్యలు వస్తాయి.
Image Credit: Pixabay/ Pexels