ఖాళీ కడుపున నానబెట్టిన ఈ సూపర్ ఫుడ్స్ తిన్నారంటే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు.

కొన్ని ఎండు ద్రాక్షలను 2 కుంకుమ పువ్వు రేకులు వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు తినాలి.

ఇలా తినడం వల్ల రుతు తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది. శక్తి వస్తుంది.

నానబెట్టిన బాదం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు pH స్థాయిని సమతుల్యం చేస్తుంది.

చియా విత్తనాలలో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మెండు. పేగు కదలికలు మెరుగుపరుస్తాయి.

నానబెట్టినవి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.

వాల్ నట్స్ నానబెట్టి తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది.

అంజీరాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మలబద్ధకం నివారిస్తుంది.

మొలకెత్తిన గింజలు తింటే బరువు తగ్గుతారు. ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం అందిస్తుంది.

Image Credit: Pixabay/ Pexels