పిల్లల దంతాలు బావుండాలంటే, వీటిని తక్కువ తినిపించండి

పిల్లల దంత ఆరోగ్యాన్ని చాలా మంది తల్లిదండ్రులు తేలికగా తీసుకుంటారు. బ్రష్ చేసినా చేయకపోయినా పట్టించుకోరు.

వారి దంతాల ఎనామిల్ దెబ్బతింటే ఇతర సమస్యలు వస్తాయి. పిప్పి పళ్ల సమస్య మొదలైందంటే, పన్ను తీసేసే పరిస్థితులు వస్తాయి.

కొన్ని రకాల ఆహారాలను తగ్గించడం ద్వారా వారి దంతాల ఎనామెల్‌ను కాపాడుకోవచ్చు.

చక్కెర, పిండి పదార్థాలు నిండిన ఆహారాలను పిల్లలకు తక్కువగా ఇవ్వాలి. ఇవి దంతాలకు, చిగుళ్లకు ముప్పును కలిగిస్తాయి.

ఆరేళ్లలోపు పిల్లలకు ఫ్లోరైడ్ లేని టూత్ పేస్టునే వాడాలి. చిన్న వయసు పిల్లలు పేస్టును ఉమ్మకుండా మింగేసే ప్రమాదం ఉంది.

ఏదైనా తిన్నాక నోరు పుక్కిలించేలా చేయాలి. లేకుంటే ఆహారం అవశేషాలు సందుల్లో ఉండిపోయి దంతక్షయానికి దారితీస్తుంది.

ముళ్లలాగా గుచ్చుకునే బ్రష్‌లు పిల్లలకు వాడడం మంచిది కాదు. ఇవి ఎనామిల్, చిగుళ్ల కణజాలానికి హాని కలిగించవచ్చు.

దంతవైద్యులు పిల్లలకు మృదువుగా ఉండే బ్రష్‌లను వాడమని సిఫార్సు చేస్తారు. టూత్ బ్రష్‌కు ఉండే ముళ్లు BPAరహితంగా ఉండాలి.