శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే రోజుకి కనీసం 8 గ్లాసుల నీటిని తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.

హైడ్రేట్ గా ఉండటానికి నీరు మాత్రమే తాగాలా? అంటే కాదని అంటున్నారు పోషకాహార నిపుణులు.

హైడ్రేషన్ అంటే నీరు తాగడం కాదు శరీరం నీటిని నిలుపుకోవడం. దాహం తీర్చడంలో నీరు చాలా తక్కువ పాత్ర పోషిస్తుందని తేలింది.

అందుకే నీటిని బదులుగా ఈ పానీయాలు తాగారంటే దాహం తీరుతుంది, హైడ్రేట్ గా ఉంటారు.

పాలు దాహం తీర్చడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగని నీరు తాగొద్దని ఆయన చెప్పడం లేదు. పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి.

నీరు తాగడానికి బదులు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు

కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్

లిక్విడ్ డ్రింక్స్ మాత్రమే కాకుండా తినే ఆహారాలు కూడా హైడ్రేట్ గా ఉండటానికి సహాయపడతాయి.

పుచ్చకాయలు, టొమాటోలు, నానబెట్టిన బీన్స్, తాజా పండ్లు, కూరగాయలు వంటి వాటిని తీసుకుంటూ కూడా హైడ్రేట్ గా ఉండవచ్చు.

నీరు తాగడంతో పోలిస్తే ఒక పండు పూర్తిగా తిన్న కూడా శరీరంలో ద్రవాలు ఎక్కువ కాలం పాటు ఉంటాయి.
Image Credit: Pexels