బ్లూ టీ తాగితే డయాబెటిస్ అదుపులో...

మధుమేహలకు బ్లూ టీ అనేది ఒక వరం అని చెప్పొచ్చు. రోజూ రెండుసార్లు బ్లూ టీ తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

ఈ బ్లూ టీ చేయడం కూడా చాలా సులువు. ఇంట్లో శంఖ పూల మొక్కను పెంచుకుంటే చాలు. ఆ పువ్వులతోనే టీ చేసుకోవచ్చు.

ఈ బ్లూ టీ ఎంతో మేలు చేస్తుంది. కంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. కళ్ళు మసకబారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే నాలుగు పువ్వులు కోసి రెడీగా పెట్టుకోండి. స్టవ్ మీద టీ కాచే గిన్నెను పెట్టి ఒక కప్పు నీరు వేయాలి.

ఆ నీరు వేడెక్కాక ఈ శంఖు పుష్పాలు వేసి మరిగించాలి. ఆ శంఖు పుష్పాల్లోని రంగువల్ల టీ నీలం రంగులోకి మారుతుంది.

తర్వాత వడకట్టుకొని ఆ టీని తాగేయాలి. అవసరమైతే చెంచా తేనె వేసి తాగొచ్చు.

మధుమేహం రాని వాళ్ళు ఈ టీ ని రోజూ తాగడం వల్ల ఆ రోగం వచ్చే అవకాశం తగ్గిపోతుంది.

ఈ బ్లూ టీని క్రమం తప్పకుండా రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.