రెడ్ వైన్ తాగితే మంచిదే అంటున్న సైన్సు

నాన్ ఆల్కహాలిక్ రెడ్ వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని సైన్స్ సమర్ధిస్తోంది.

ఈ పానీయంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడతాయి.

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం ఆల్కహాల్ లేని రెడ్ వైన్ తాగడం వల్ల డయాబెటిక్ రోగులకు ఎంతో మంచిది.

రెడ్ వైన్ రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది.అందుకే మితంగా డయాబెటిక్ రోగులు రెడ్ వైన్ తాగడం వల్ల మంచే జరుగుతుంది.

దీనిలో రెస్వరాట్రాల్ అనే పాలీఫెనాల్ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రొమ్ము, అన్నవాహిక క్యాన్సర్‌ను తగ్గించే సామర్థ్యం రెడ్ వైన్‌లో ఉన్నట్టు శాస్త్రీయంగా నిరూపణ అయింది.

రెడ్ వైన్ తాగడం వల్ల నోటిలో హానికరమైన బ్యాక్టీరియా కూడా బయటికి పోతుంది.

రెడ్ వైన్‌లో ఉత్తమమైన పాలీఫెనాల్స్ ఉంటాయి. అవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి.