షారూక్ ఖాన్ డైట్ ఇదే... అందుకే అంత ఫిట్

57 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా ఉంటారు షారూక్ ఖాన్.

వ్యాయామం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం వల్ల ఆయన ఫిట్ గా ఉంటున్నారు. ఆయన రోజులో ఏం తింటారో తెలుసా...

ఆయన భోజనంలో స్కిన్‌లెస్ చికెన్, ఎగ్ వైట్స్, పప్పు దినుసులు, ఫ్యాట్ లేని మిల్క్, లేత గొర్రె మాంసం ముఖ్యంగా ఉంటుంది.

కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు, పండ్ల జ్యూసులు అధికంగా తాగుతారు. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

బ్రేక్ ఫాస్ట్‌లో ఎక్కువగా గుడ్లు, పండ్ల జ్యూసు, సలాడ్ తింటారు.

ప్రాసెస్డ్ ఆహారం, చక్కెర, వైట్ రైస్, బ్రెడ్ వంటివి దూరం పెడతారు.

క్యారెట్, బీట్ రూట్ వంటి పచ్చి కూరగాయలు అధికంగా తింటుంటారు.

డిన్నర్లో తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటారు. ఎక్కువగా సలాడ్ తింటారు.

బ్లాక్ కాఫీ అంటే చాలా ఇష్టం. రోజులో ఎక్కువ సార్లు తాగేది ఇదే.